కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఆరోగ్యానికి మేలు

చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల...

హెల్త్ టిప్స్రో: జా లిప్స్...

హెల్త్ టిప్స్రో: జా లిప్స్...

సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్...

తాజా యాపిల్ తో బోలెడన్ని లాభాలున్నాయి. ముఖ్యంగా రోజూ ఒక యాపిల్ తింటే మధుమేహానికి దూరంగా ఉండవచ్చని బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో ఇది తేలింది. ఇప్పటి వరకూ రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కు  దూరంగా ఉండవచ్చనే నానుడిలో ఉన్న సామెతలో ఆంతర్యం ఇదేనేమో అంటున్నారు పరిశోధకులు. మొత్తానికి రోజూ యాపిల్ తినే 5 లక్షల మందిపై ఏడేళ్ల పాటు చేసిన పరిశోధన ఇదే విషయాన్ని తెలియజెబుతోంది.

మొటిమెలు రాకుండా ఏం చేయాలి... చాలా సింపుల్ అండీ టీకా వేయించుకోవడమే. అదేంటి మొటిమలకు టీకాలా అంటే అవును సైన్స్ అద్భుతాలను సాధ్యాలుగా మార్చుతోంది మరి. సాధారణంగా 11నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మొటిమెలతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. దీనిపై దృష్టిసారించిన చర్మ సౌందర్య నిపుణులు టీకాను అభివృద్ధిచేశారు. మరో రెండేళ్లలో ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈటీకా ప్రయోగాత్మకంగా తుది దశ పరిశోధనలో ఉంది. నిజానికి మొటిమలు రావడం ఆరోగ్యకరమైనదే అని పరిశోధనల్లో తేలినా వీటితో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేవారి సంఖ్య చాలా ఎక్కువ.

హాయిగా నిద్రపోవాలంటే మీరు తినే ఆహారంలో ఉప్పును తగ్గించండి అంటున్నారు వైద్యులు. వయసు మళ్లినవారికి ఇది మరింత మేలుచేస్తుందట. పదేపదే మూత్రానికి వెళ్లేవారికి నిద్రలేమి సమస్యలు వస్తాయి. దీంతో పగలంతా చికాకుగా ఉంటారు. అందుకే రాత్రిపూట మాత్రం ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే సరిపోతుందని మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లే అవసరం రాదని చెబుతోంది ఒక యూరప్ రీసెర్చ్.

చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాలం పాటు వ్యాధులపాలిట పడే అవకాశాలు ఉండవని తేల్చింది తాజా సర్వే. ఇందులో భాగంగా రోజూ వంద గ్రాముల ప్రౌటీన్ తప్పకుండా తీసుకుంటే మధ్యవయస్సు వారికి గుండెనొప్పులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకూ తగ్గుతుందట.