తాజా యాపిల్ తో బోలెడన్ని లాభాలున్నాయి. ముఖ్యంగా రోజూ ఒక యాపిల్ తింటే మధుమేహానికి దూరంగా ఉండవచ్చని బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో ఇది తేలింది. ఇప్పటి వరకూ రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండవచ్చనే నానుడిలో ఉన్న సామెతలో ఆంతర్యం ఇదేనేమో అంటున్నారు పరిశోధకులు. మొత్తానికి రోజూ యాపిల్ తినే 5 లక్షల మందిపై ఏడేళ్ల పాటు చేసిన పరిశోధన ఇదే విషయాన్ని తెలియజెబుతోంది.