చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాలం పాటు వ్యాధులపాలిట పడే అవకాశాలు ఉండవని తేల్చింది తాజా సర్వే. ఇందులో భాగంగా రోజూ వంద గ్రాముల ప్రౌటీన్ తప్పకుండా తీసుకుంటే మధ్యవయస్సు వారికి గుండెనొప్పులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకూ తగ్గుతుందట.

మనం నిత్యం తినే ఆహారంలో 80 శాతం కార్బోహైడ్రేట్లు, 10 శాతం ప్రొటీన్, మరో 10 శాతం కొవ్వు పదార్థాలు ఉండేలా సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో వృద్ధాప్య సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతోంది సర్వే. టూమచ్ గా ప్రొటీన్ తినడం వల్ల తాత్కాలికంగా మాత్రమే బరువు తగ్గుతారని, కానీ దీంతో మధ్యవయస్సులో ఆయుష్షు తగ్గే ప్రమాదం హెచ్చుగా ఉందని చెబుతుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ప్రొటీన్ పై, కార్బైహైడ్రైట్స్ పై ఉన్న అపోహలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధన తొలగించింది.

e-max.it: your social media marketing partner