నిమ్మకాయ అంటే తెలియని వారుండరు, అది కాస్త పుల్లగా ఉన్నప్పటికీ తినే వాళ్ళు కూడా ఉంటారు.
ఇక నిమ్మకాయ చేసే మేలు ఏంటంటే ఇది నోటి పూత నివారణకు మంచి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాకుండా జ్వరం తో ఉన్నవాళ్ళకి పండ్ల రసాలతో పాటు నిమ్మరసం కూడా ఇస్తే త్వరగా కోలుకుంటారు. ఇంకా వేవిళ్ళతో భాధపడే వారికి ఈ నిమ్మరసం తేనెలో కలిపి ఇస్తే వాంతులు త్వరగా తగ్గుతాయి. అంతేకాకుండా నిమ్మరసం లో ఉండే యాసిడ్ ఆమ్లాలు కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తాయి.ఇంకేముంది మీరుకూడా ప్రయత్నించి చూడండి.