దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

అదో వేడుక, ప్రకృతిని కొలిచే పండుగ, ఆదివాసీయుల ఆత్మీయతకు వేధిక, గూడెంలో సేదతీరే ఆదివాసియుల ఆత్మీయ పలకరింపులకు సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనం ఆ జాతర. అదే నాగోబా జాతర....  సమ్మక్క సారలమ్మ జాతర తరువాత అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న జాతర ఈ నాగోబా జాతర.  పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని మెస్రం మంశీయులు నేటి అర్ధరాత్రి తమ ఆరాద్య దైవమైన నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఉత్సవాలు వారం రోజులపాటు జరుగుతాయి.  గిరిజనుల ఇలవేల్పుగా భక్తుల కోర్కెలను తీర్చే కొంగుబంగారంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది.

రెండో దక్షిణ కాశిగా పిలవ బడే శ్రీ రామలింగేశ్వర జాతరకు అధికారులు అన్నిహంగులతో సర్వసిద్ధంగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట దుబ్బాక మండలం రామలింగేశ్వర జాతర మాగ అమావాస్య పురస్కరించుకుని భక్తులకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహించారు. ఈ జాతరకు ఉమ్మ జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగా రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారని, జాతరలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.

గిరిజనుల పండుగ నాగోబా మహాజాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నాగోబా మహాజాతర ఆదిలాబాద్ జిల్లాలో మొదలుకానుంది. మర్రిచెట్ల నీడన మెస్రం వంశీయులు జాతర సందర్భంగా పూజలు చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. అనంతరం రాత్రి గంగా జలాలతో నాగోబాకు అభిషేకం చేయనున్నారు. నాగోబా మహాజాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి భారీగా గిరిజనులు తరలిరానున్నారు.

శ్రీవారి భక్తులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసే లడ్డూ ప్రసాదం ధర మరోసారి పెరిగింది. స్వామివారి ప్రసాదం ధరలను టీటీడీ భారీగా పెంచేసింది.