పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.
ఒకప్పుడు పల్లెల్లో ఏ ఇంటి గోడపై చూసినా దర్శనమిచ్చే పిడకలు...ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆవు పేడ పిడకలు ఆన్ లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పిడకలకు కాస్త అందాన్ని జోడించి...ఆకర్షణీయమైన ప్యాకింగ్ లతో డోర్ డెలివరీ చేస్తున్నాయి పలు ఆన్ లైన్ వ్యాపార సంస్ధలు. కొత్తొక రోత...పాతొక వింత అంటే ఇదే కాబోలు.