వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు బంగారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామి వారిని బంగారు రథంపై కొలువు దీర్చి వస్తున్న సమయంలో స్వర్ణకాంతుల మధ్య వాహన సేవను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తుల హాజరయ్యారు. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహాకా అనే నాలుగు గుర్రలను పూన్చిన స్వర్ణ రథంపై స్వామివారు విహరించారు. దారుకుడు రథసారథిగా వేలాది భక్తుల గోవిందనామస్మరణల మధ్య స్వర్ణరథం ముందుకు సాగింది.