తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించారు. గరుడవాహనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. స్వామివారి గరుడ వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.