తిరుమల నారాయణగిరి ఉద్యావనంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
మూడు రోజుల పాటు జరిగే పరిణయోత్సవల్లో భాగంగా రెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు అశ్వ వాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు దంతపు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. నారాయణ గిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి.