కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ద్వారకా తిరుమల శేషాచల కొండపై కొలువైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

రెండవ రోజు స్వామివారి  బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ముఖమండపంలో స్వామివారు మత్స్యావతారంలో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మత్స్యావతారంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం, రాత్రి అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ వేదపండితులు నిర్వహించారు. అంతేకాక స్వామివారు, అమ్మవార్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హంస వాహనంపై ద్వారకాతిరుమల పురవీధుల వెంబడి గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు మరియు పండితులు నిర్వహించారు. 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...