ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి వైశాఖమాస తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కళ్యాణ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచి వేదపండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ సుధాకర్ రావు, ఈవో త్రినాథ్రావులు రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మేళ తాళాలు బ్యాండ్ మేళాలతో ద్వారక తిరుమల పురవీధుల గుండా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.