పదో తరగతి ఫలితాలు రావడంతో తిరుమల కొండ భక్త సంద్రంగా మారింది. పాసైన విద్యార్థులు, తల్లిదండ్రులతో ఏడు కొండలు నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొదటిది నిండిపోయి రెండో క్యూకాంప్లెక్స్ కూడా 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయింది. ఇవి కాకుండా బయట కూడా క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోంది. దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా 1.84కోట్ల ఆదాయం లభించింది.