కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్కిస్టా నరశార్దుల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ ప్రభాత వేళ కలియుగ వైకుంటనాధుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మేల్కొలిపే మధురమైన సుప్రభాత శ్లోకాలను వినలేని భక్తులకు ఇక పై ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రతి నిత్యం తెల్లవారుఝామున వినేలా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...