కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్కిస్టా నరశార్దుల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ ప్రభాత వేళ కలియుగ వైకుంటనాధుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మేల్కొలిపే మధురమైన సుప్రభాత శ్లోకాలను వినలేని భక్తులకు ఇక పై ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రతి నిత్యం తెల్లవారుఝామున వినేలా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.

కలియుగ ప్రత్యేక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని మొదటి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు కొదవులేదు.ప్రభాతవేళ ఆ శ్రీనివాసుని నిద్ర నుండి మేల్కొలిపే సేవే సుప్రభాతసేవ.కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్కిస్టా నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ వేద పండితులు సుప్రభాత శ్లోకాలను ఆలపిస్తుంటే భక్తులు తన్మయత్వంతో తమ మదిలో స్వామివారి నిలువెత్తు రూపానికి నీరజనాలు సమర్పించుకున్తుంట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికీ ప్రతి నిత్యం నిర్వహించే సుప్రభాతం,తోమాల,అర్చన సేవలను ప్రత్యేక్షంగా దర్శించుకోలేని భక్తులకు నేటి నుండి ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా శ్రీవారి ప్రభాతసేవలను వినే భాగ్యాన్ని కలిగిస్తుంది టిటిడి.ప్రతి రోజు ఉదయం 3.00 గంటల నుండి 6.00 గంటల వరకు స్వామివారి సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, సేవల మధ్యలో ప్రముఖ అధ్యత్మికవేత్తలైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ లాంటి పండితుల ప్రవచనాలు, అన్నమయ్య సంకీర్తనలు, తిరుమల సమాచారం, స్వామివారి దర్శనానికి పట్టే సమయం వంటి వివరాలు భక్తులకు తెలియజేస్తారని గతంలో 2006వ సంవత్సరం వరకు శ్రీవారి సుప్రభాతం సేవలు ప్రసారం జరిగాయని, ఇప్పుడు తిరిగి పునఃప్రారంబిస్తున్నమన్నారు టిటిడి ఈఓ సాంబశివరావు. ఇందుకు కోసం ఒక సంవత్సరానికి 11 లక్షల రూపాయలు ఆకాశవాణి కి చెల్లిస్తున్నట్టు ,ఆంధ్రప్రదేశ్,తెలంగాణా,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భక్తులకు  శ్రీవారి ప్రభాతసేవలను వినిపించడం ద్వారా స్వామివారి కృపకు పాత్రులవ్వాలని ఈఓ కోరారు.

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...