టిటిడి అనుబంధ ఆలయం అయిన తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళా స్వామి కల్పవృక్షా వాహనంపై ఊరేగారు.

 

పవిత్ర పెన్నానదీ తీరాన వెలసిన తల్పగిరి రంగనాధుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటలో ఉండే దేవాలయంలో ఇవాళ గరుడ సేవ నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ మంచికంటి సుధాకర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు భక్తుల అధిక సంఖ్యలో హాజరయ్యారు. 

 

కోర్కెలను నెరవేర్చే లక్ష్మీనృసింహుడు కొలువైనదే శింగరకొండ క్షేత్రం. ఏటా ఫాల్గుణ మాసంలో వార్షిక ఉత్సవాలు నిర్వహించిడం అనవాయితీ.

11రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈరోజు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రికి డోలోత్సవ కార్యక్రమం జరుగనుంది. చక్రతీర్థ స్నానంతో పాటు వైదిక కార్యక్రమాలన్నీ ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా బాలాలయంలో నిర్వహించారు.

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...