కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా....గ్రామీణులు, గిరిజనుల ఆరాధ్య దేవతగా...విరాజిల్లుతున్న మాడుగుల మోదకొండమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వనదేవత గా పూజలు అందుకుంటున్న మోదకొండమ్మను గిరిజనులు ఇలవేల్పుగా కొలుచుకుంటారు. భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన మాడుగుల మోదకొండమ్మ జాతర పై సి.వి.ఆర్ ఓం సమాచారం ప్రత్యేక కథనం...
క్రింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=lL8-XZtSZlc
టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన నేటి ఉదయం గోవిందరాజస్వామి సింహ వాహనంపై వూరేగుతూ భక్తులను కటాక్షించారు. గోవిందరాజస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సింహవాహన సేవకు ముందు భక్తుల కోలాటాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం స్వామివారు ముత్యపు పందిరి పై విహరించనున్నారు.
దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...