అమరావతి: మెగాస్టార్ చిరంజీవి దంపతులు సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి
వెళ్లిన చిరంజీవి... ఆయన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను చిరంజీవి పుష్ప గుంచం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు. కాగా... జగన్ సీఎం అయ్యాక చిరంజీ ఆయనను కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చిరంజీవి తానూ హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ వీక్షించాలని కోరినట్టు సమాచారం.