ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తాం. లేకుంటే ఇవ్వలేం అని వృత్తివిద్యా కళాశాలలు షరతు విధించడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఫీజు బకాయిలకు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లకు లింకుపెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ట్యూషన్‌ ఫీజును ప్రభుత్వమే కాలేజీలకు రీయింబర్స్‌ చేస్తుందంటూ గతంలో ఉత్తర్వులు జారీ చేసినందునే ఆర్థిక స్థోమత లేకున్నప్పటికీ తాము ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో అడ్మిషన్‌ తీసుకుని చదువుకున్నామని వారు చెబుతున్నారు. ఒకసారి అడ్మిషన్‌ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం బకాయిలు పడిందన్న కారణంతో మమ్మల్ని ఫీజు చెల్లించమంటే ఎలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విభజన జరిగి ఏళ్ళు గడుస్తున్నా విద్యార్థుల కష్టాలు మాత్రం తీరడంలేదు. పదేళ్ళ ఉమ్మడి అడ్మిషన్ల నేపథ్యంలో 85 శాతం అడ్మిషన్లు లోకల్ విద్యార్థులతో భర్తీచేయగా మిగిలిన 15 శాతం అడ్మిషన్లకు ఏపి తెలంగాణ రెండురాష్ట్రాల్లో ఇద్దరు విద్యార్థులు అర్హులు. అడ్మిషన్లు అయితే సజావుగా అయిపోతున్నాయి కాని వారి ఫీజుల చెల్లింపు వ్యవహారం మాత్రం ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. సొంతరాష్ట్రాలలో ఫీ రీయంబర్సె మెంట్ బకాయిలే వేలకోట్లు కావడంతో వాటిని చెల్లించుకోలేక ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి.

ఇప్పుడు  మెరిట్ కోటాక్రింద పక్క రాష్ట్రంలో చదివే విద్యార్థులకు చెల్లింపు వ్యవహారం మరో తలనొప్పిగా మారింది. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ఏపి తెలంగాణ ప్రభుత్వాల పంతాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికి పదేళ్ళు ఉమ్మడి అడ్మిషన్ల నేపథ్యంలో ఓపెన్ కేటగిరి క్రింద ఏపి విద్యార్థులు తెలంగాణలో, తెలంగాణ విద్యార్థులు ఏపిలో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే వీరి ఫీజులు చెల్లింపుపై ఇప్పుడు చిక్కువచ్చి పడింది. తెలంగాణలో చదివే ఏపి విద్యార్థులు తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపిలో చదివే  తెలంగాణ విద్యార్థులకు తమకు సంబందంలేదని ఏపి ప్రభుత్వం చెబుతుండటంతో వీరి ఫీజుల చెల్లింపు వ్యవహారం ప్రహసనంగా మారింది. విభజనచట్టం ప్రకారం తెలంగాణలో చదివే విద్యార్థులకు 52 శాతం ఫీజు తాము చెల్లిస్తామని 48 శాతం ఫీజు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని ఏపి ప్రభుత్వం చెప్పింది.అయితే దీని పై తెలంగాణ సర్కార్ సరే అన్నప్పటికి ఆ ప్రపోజల్ ముందుకు సాగడంలేదు. అయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రం విద్యార్థులను ఫీజుల పేరుతో వేధిస్తున్నాయి.

ఓపెన్ కేటగిరీలో చేరిన విద్యార్థుల విషయంలో ఏ ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్ల మీరే ఫీజులు కట్టండంటూ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తుండటంతో ఏపి తెలంగాణలో కలిపి యాభైవేల మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. 2015-16 అకడమిక్ ఇయర్ లో కోర్స్ పూర్తిచేసిన విద్యార్థులకు కూడా చాలామందికి ఇంకా ఫీ రీయంబర్సె మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వారి సర్టిపికేట్లు ఇంకా యాజమాన్యాలదగ్గరే ఉండిపోయాయి. వీరి ఫీజులను ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చెల్లించలేదు. దీనిపై ఏ సర్కారు సీరియస్ గా తీసుకోవడంలేదు. యాజమాన్యాలు మాత్రం వారి చేతివాటం చూసిస్తున్నాయి. ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తాం లేకుంటే ఇవ్వలేం’ అని వృత్తివిద్యా కళాశాలలు షరతు విధించడంతో వేలాదిమంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఫీ బకాయిలు విడుదలచేయకుండా విద్యార్థులు ఫీజులు చెల్లించకుంటే కళాశాలలు ఎలానడపాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వాలు యాజమాన్యాల పంతాలు పట్టింపులతో విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. విభజనచట్టం ప్రకారం ప్రభుత్వాలు ఫీజులు విడుదలచేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందిచి ఫీ బకాయిలు విడుదల చేయకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

 

e-max.it: your social media marketing partner

త్వరలో టీడీపీలో చేరనున్న నటి వాణీ విశ్వనాథ్

ప్రముఖ సినీనటి వాణీ విశ్వనాథ్ త్వరలో తెలుగుదేశంలో చేరి రాజకీయ అరంగేట్రం చేస్తానన్నారు. అనంతపురంలో జరిగిన సమావే...

జగన్ పాదయాత్రలో గొడవ

జగన్ పాదయాత్రలో గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ తో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సె...

కర్నూల్ జిల్లాలో విషాదం... గుండెపోటుతో రిటైర్డ్ ఎస్సై మృతి

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది. కూరగాయలను కొనుక్కొనేందుకు కూరగాయల మార్కెట్ కు వచ్చిన రిటైర్డ...

కర్నూల్ జిల్లాలో శాసన మండలి ఛైర్మన్ మీడియా సమావేశం

శాసన మండలి ఛైర్మన్ గా నియమితులైన ఫరూక్ కర్నూల్ జిల్లా నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు మండలి చైర్మన...

జగిత్యాల జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం సృష్టించింది.

నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డ శాసన సభ్యుడు

ఖమ్మంజిల్లా వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ తన నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డారు. సెల్ పోన్ లో తన సామాజిక వర్గాన్న...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

రాహుల్ ని 'పప్పు' అనడాన్ని నిషేదించిన గుజరాత్ ఎన్నికల కమిషన్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ...

బాహుబలి స్టంట్ చేయబోయి గాయాలపాలైన యువకుడు

బాహుబలిలో ప్రభాస్ చేసిన స్టంట్ ను రియల్ గా చేయాలని భావించిన యువకుడు చావు అంచుల దాకా వెళ్లాడు. ఏనుగుకు అరటిపండు...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసే ఇంటర్నేషనల్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు అయింది.

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నంది అవార్డులపై వ్యక్తమవుతున్న అసంతృప్తి

నంది అవార్డులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ వర్గం వారికి అవార్డులను ఎక్కువగా ప్రకటించారనే విమర్శలు వెల్లువెత్త...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...