ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసిన రైతుకు సిసిఐ అడ్డగోలు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతు తను పండించుకున్న పంటను మార్కెట్‌లో విక్రయానికి తీసుకొస్తే మెలికపెట్టి మోసం చేస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతలకు గిట్టుబాట ధర లభించడంలేదు.

ఇదే అదునుగా చేసుకుని వ్యాపారులు రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు. మార్కెట్‌లో పత్తి రైతు దగా పడుతున్నాడు. వ్యాపారులు సిండికేటుగా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నిర్ణయించిన ధరకంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతు పంటవైపు కన్నెత్తైనా చూడటంలేదు. రైతులను ఆదుకోవాల్సిన సిసిఐ నిబంధనల పేరుతో చోద్యం చూస్తోంది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఇరువై రోజులక్రితం పత్తి కొనుగోళ్ల ప్రారంభమయ్యాయి. అయితే ప్రయివేటు వ్యాపారస్తులు క్వింటాల్‌ పత్తికి నిర్ణయించిన రూ.4500 ధర కల్పిస్తామని చెప్పడంతో రైతులు అందుకు అంగీకరించారు. వారం రోజులు తిరక్కుండానే పత్తి కొనుగోళ్లకు వ్యాపారులు తేమ కేవలం 8 నుంచి 12 శాతం మాత్రమే ఉండాలని కండీషన్‌ విధించడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సిసిఐ సైతం 8 శాతం కంటే తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తగ్గుతుందని తేల్చి చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. తేమ విషయమై అధికారులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు విషయం తెలుసుకున్న జేసి కృష్ణారెడ్డి, డిఎస్‌పి లక్ష్మినారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పత్తి రైతులతో మాట్లాడారు.

దీంతో బుదవారం పత్తి కొనుగోళ్ళు పూర్తిగా నిలిచిపోయాయి. 8 నుండి 12 శాతానికే తేమ మినహాయిస్తామని, అంతకంటే ఎక్కువగా ఉంటే ధర తగ్గుతుందని వ్యాపారులు చెప్పడంతో రైతులు మరింత రెచ్చిపోయారు. రాష్ట్రంలో ఏ మార్కెట్‌లో లేనివిధంగా తేమశాతం పేరుతో సిపిఐ కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ మెలిక పెట్టడంతో దీన్నిఆసరాగా చేసుకుని వ్యాపారులు ధర దోపిడీ పర్వానికి తెరలేపుతారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిపంటకు కనీస మద్దతు ధర కల్పించండి మహాప్రభో అంటూ ఇప్పటికే రోడ్డెక్కి మొరపెట్టుకున్నా రైతుల ఆవేదన చివరకు అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇదిలా ఉండగా కనీసమద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన సిసిఐ తేమ పేరుతో ధర తగ్గించడంతో రైతులు ప్రయివేటు వ్యాపారులపై మొగ్గుచూపాల్సి వస్తోంది. తేమ 12 శాతానికి మించి కొనుగోలు చేయబోమంటూ చేతులు ఎత్తెయడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రైతులకు అండగా నిలవాల్సిన సిసిఐ ఇలాంటి నిబంధనలు విధిస్తూ నిలువు దోపిడీకి పాల్పడడం ఎంతవరకు సమంజసమంటూ రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పత్తికి కనీస మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

e-max.it: your social media marketing partner

రైతే రాజు... రైతులకు రూ.లక్ష రుణమాఫీ...

రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఇస్తున్న రూ.4వేల నగదును రూ.5వేలకు పెంచుతామని ప్రకటించారు టీఅర్ఎస్ అధినేత తెలంగాణ...

మోడీకి భయపడే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు..

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో సరైన కారణం చెప్...

భ‌వానీలతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రిపై ద‌స‌రా శ‌ర‌న్నవ‌రాత్రి ఉత్సవాలు ఆరవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిరూ...

ఉత్తమ విద్యార్థులకు... ప్రతిభా అవార్డ్స్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ పూర్తి అభివృద్ధి జరిగిన తరువాత రాష్ట్ర విభజన జరిగిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈరోజు...

మీడియా సెంట‌ర్‌ను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ

హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల స‌మాచారాన్ని ప్రజలు ఎప్పటిక‌ప్పడు తెలుసుకునే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు శ్రీకారం చ...

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌‌ లో గ్రూప్‌-4 జవాబు పత్రాలు

తెలంగాణ గ్రూప్‌-4 పరీక్ష రాసిన అభ్యర్థుల డిజిటల్‌ ఓఎమ్మార్‌ షీట్లను టీఎస్‌పీఎస్సీ తమ వెబ్‌సైట్‌‌ లో అందుబాటులో...

శిథిలాల కింద వందలాది మృత దేహాలు...

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో సంభవించిన భూకంపం (సునామీ)లో ధాటికి ఆ ద్వీపం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ ప్ర...

మరో సునామి హెచ్చరిక...

జకార్త : ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం ఓ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై...

రావణవధ కార్యక్రమానికి మార్గదర్శకాలు ఇవ్వండి

దేశ రాజధాని ఢిల్లీలో దసరా పండుగా సందర్భంగా ఏటా పెద్ద ఎత్తున నిర్వహించే రావణవధ కార్యక్రమానికి మార్గదర్శకాలు రూప...

ఆకాశాన్ని అంటిన 'సేవ్ శబరిమల' నిరసనలు

మహిళలందరూ శబరిమల ఆలయంలోనికి వెళ్ళడానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం కేరళలో చెలరేగిన

ఉద్యోగం కావాలంటూ.. మంత్రి పేరుతొ ఫేక్ లెటర్

అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సిఫార్సు చేస్తున్నట్టుగా ఓ ఎమ్మల్యే కారు డ్రైవర్ విద్యుత్ శాఖ మంత్...

ఏపీ మంత్రికి తృటిలో తప్పిన పెను ప్రమాదం...

ఏపీ మినిస్టర్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో...

ప్రిన్స్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్ ఖరారు...

ప్రిన్స్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్ ఖరారు...

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఆరంగేట్రం చేయనున్న సినిమాకి హీరోయిన్ ఖరారయ్యింది. శశి కుమ...

చంద్రబాబు దొరికేశాడు...వర్మ

సోషల్ మీడియాలో ట్రెండ్ ఐన ఓ వీడియోలోని చంద్రబాబు పోలిన వ్యక్తి ఆచూకీ తెలిపితే లక్ష రూపాయలు రివార్డ్ ఇస్తానని ర...

ఉప్పల్ టెస్ట్ మనదే...

ఉప్పల్ టెస్ట్ మనదే...

వెస్టిండీస్ తో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పది వికెట్ల తేడ...

ఆసియ కప్ ఫైనల్: ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బంగ్లా...

ఆసియ కప్ మ్యాచ్ లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తోంద...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...