కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఈరోజు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 29వ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు
తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా సిమెంట్, ఏసీ, పెద్ద టెలివిజన్లు తదితర వాటి ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాన్ని కూడా పరిశీలించనున్నారు. ఒక వేళ అదే జరిగితే చమురు కంపెనీలకు ఉపశమనం లభిస్తుంది.
ఈ సమావేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రభావం చూపే వాటి పైనా జీఎస్టీ తగ్గించే అవకాశం గురించి కూడా అధికారులు చర్చించనున్నారు. ఏపీ వంటి రాష్ట్రాలు ట్రాక్టర్ విడిభాగాలు, ఎగ్ ట్రేలు, సినిమా టికెట్లు, పాత్రలు, తక్షణం లభ్యమయ్యే ఆహారం, బ్రేక్‌ఫాస్ట్‌కు అవసరమైన వాటిపైన జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి వీటిపైనా కౌన్సిల్ లో చర్చించే అవకాశం ఉంది.