హైదరాబాదులో ఆగస్టు 9న ఐకియా ఫర్నిషింగ్ తన తొలి స్టోర్ ను ప్రారంభించనుంది. భారత్ లో ఐకియాకు ఇదే తోలి స్టోర్, దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టోర్ ను ప్రారింభిచేందుకు
కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జెస్పర్ బ్రోడిన్ వస్తున్నారు. ఆయనతోపాటు కంపెనీకి చెందిన పలువురు ప్రతినిధులు కూడా వస్తారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్టోర్ ను జులై 19నే ప్రారంభించాల్సి ఉంది కానీ ఏమాత్రం రాజీలేకుండా క్వాలిటీ ప్రొడక్ట్స్ తో పాటు సౌకర్యాలు కల్పించేందుకు ఐకియా ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 9కి వాయిదా వేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు నెలకొల్పడానికి అన్ని విధాలా సాయం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కంపెనీ సీఈఓ ఇతర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.