భారతీయ స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డులు సృష్టించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ అయితే 38 వేల మార్కు చేరువలో ఉంది. ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. మార్కెట్లు ఆశాజనకంగా ఉండడంతో
బుధవారం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా 0.59 శాతం వృద్ధి నమోదు చేసింది. 221 పాయింట్లు బలపడి 37,887 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ నిఫ్టీ 60 పాయింట్ల వృద్ధితో (+0.53 శాతం)11,450 దగ్గర ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఓ దశలో సెన్సెక్స్ 37,931 మార్కుకు చేరుకున్న సెన్సెక్స్ ఆల్ టైం హైకి చేరుకుంది. తర్వాత 44 పాయింట్లు తగ్గిపోయింది. ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్స్ కళకళలాడాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ నిఫ్టీ, సెన్సెక్స్ ల్లో టాప్ గెయినర్ గా నిలిచింది. మంగళవారం ముగింపుతో పోలిస్తే 2.85 శాతం బలపడి రూ. 1,217.25 చేరుకుంది. ఈ షేర్ ఇంట్రాడేలో రూ. 1,222 వద్ద కదలాడింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా లాభాలు ఆర్జించాయి.
నిఫ్టీలో ఓఎన్జీసీ (+2.95 %), రిలయన్స్ ఇండస్ట్రీస్ (+2.83 %), బజాజ్ ఫైనాన్స్ (+2.40 %), ఐసీఐసీఐ బ్యాంక్ (+1.77 %), భారతి ఇన్ ఫ్రా (+1.59 %) టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ లో రిలయన్స్ (+10.67 %), హాత్ వే (+7.78 %), ఐనాక్స్ (+6.10 %), స్ట్రైడ్స్ ఫార్మా (+5.80 %), స్టెరిలైట్ టెక్నో (+5.48 %) టాప్ గెయినర్స్ గా నిలదొక్కుకున్నాయి.