మంచి ఊపు మీదున్న భారతయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. తొలిసారిగా ఆల్ టైం హైకి చేరుకున్నాయి. బీస్ఈ సెన్సెక్స్ 38 వేల మార్క్ ను అధిగమించింది. నేషనల్ స్టాక్
ఎక్స్ ఛేంజ్ - నిఫ్టీ 11,500 సమీపానికి చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 37,887 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ లాభాల్లో దూసుకుపోతోంది. మార్కెట్లు మొదలైన గంటలోపే 150 పాయింట్లు బలపడింది. నిఫ్టీ కూడా క్రితం ముగింపు 11,450 దగ్గర మొదలై 30కిపైగా పాయింట్లు వృద్ధి చెందింది. ఇన్ఫోసిస్, బ్యాంకింగ్ షేర్లు ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్, హిండాల్కో, ఇన్ఫోసిస్, ఆర్ కామ్, హాత్ వే కేబుల్స్, జైప్రకాశ్ అసోసియేట్స్ షేర్లు ఇన్వెస్టర్ల పంట పండిస్తున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి ఏ కంపెనీ అగ్ర భాగాన నిలుస్తుందో చూడాలి.