భారత్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఆల్ టైం హైలో ముగిసింది. 38 వేల బెంచ్ మార్క్ దాటేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్-నిఫ్టీ కూడా
లాభాలను పంచిపెట్టింది. గురువారం ఇన్వెస్టర్ల పంట పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే136 పాయింట్ల లాభంతో 38,024 వద్ద ముగిసింది. 11,450 దగ్గర మొదలైన నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 11,470 దగ్గర ముగిసింది. బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లు కళకళలాడాయి. నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్ (+4.49%), యాక్సిస్ బ్యాంక్ (+4.15%), హిందాల్కో (+3.11%), ఎస్బీఐ (+2.82%), వేదాంత (+2.58%) టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సెన్సెక్స్ లో శారదా క్రాప్ కెమ్ (+13.64%), దేనా బ్యాంక్ (+13.40%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్స్ (+12.97%), హాత్ వే (+10.57%), పీసీ జ్వెల్లర్స్ (+10.49%) టాప్ గెయినర్లుగా ఇన్వెస్టర్ల పంట పండించాయి.