డాలర్ తో రూపాయి పతనం మరింత వేగంగా పడిపోవడం కొనసాగుతోంది. సోమవారం జెట్ స్పీడ్ తో ఏకంగ రూపాయి విలువ తగ్గిన రూపాయి, మంగళవారం కాస్త నిలకడగా ఉండి పర్వాలేదనిపించినా,
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో మరింత కుదేలైంది. వారం క్రితం 68 రూపాయలకే లభించిన డాలర్ ఇపుడు ఏకంగా 70.67 పలుకుతోంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ రూపాయికి అండగా నిలుస్తుందా? అన్న టెన్షన్ భారత మార్కెట్ లో నెలకొంది. ఒకవేళ రూపాయిని గనక ఆర్బీఐ వొదిలిస్తే దేశంలో అనేక రకాల వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశముంది అదే జరిగితే మాంద్యం ముప్పు కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే రూపాయి పతనం 71కి చేరుతుందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ముడిపదార్థాలు దిగుమతి చేసుకునే ప్రతి కంపెనీ తాజా పరిస్థితిపై చాలా ఆందోళనతో ఉన్నాయి. డాలర్ తో రూపాయికి 71 చాలా కీలకమని, ఈ స్థాయి గనక కోల్పోతే మాత్రం ఖచ్చితంగా రూపాయి మరింత పతనమై 72 లేదా 73 వరకు పడిపోతుందని ఫారెక్స్ మార్కెట్ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు.