ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల సేకరణ కోసం అమరావతి బాండ్ల లిస్టింగ్, సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
(బీఎస్ఈ)లో నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు, బీఎస్ఈ సీఈవో ఎండీ ఆశిష్ కుమార్‌తో కలిసి గంట కొట్టి ఈరోజు ఉదయం 9.15 గంటలకు ప్రారంభించారు. బీఎస్ఈలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఆదివారం రాత్రి ముంబై బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. లిస్టింగ్ అనంతరం సీఎం చంద్రబాబు ముంబై లోని పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారాణి సమాచారం. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. గోద్రేజ్ కంపెనీ ఎండీ నడియార్.. మహేంద్ర వరల్డ్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ సీవోవో శ్రీవాత్సవ.. ఆదిత్యా బిర్లా గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ కుమార మంగళంతో పాటూ మరికొన్ని కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవుతారని తెలుస్తోంది. వీరితో ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించనున్నారు.