బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) లో అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంపై ముంబై వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ముంబైలోని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
అందులో బాగంగా బాంబే హౌస్ లోని టాటా ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ రతన్ టాటాతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో రతన్ టాటా తో పాటు టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడి అవకాశాల గురించి వీరు ప్రముఖంగా చర్చించినట్లు సమాచారం.