అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ బుధవారం మధ్యాహ్నానికి 70.57 గా
నమోదైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో యూఎస్ డాలర్ జెట్ స్పీడ్ అందుకుంది, దీంతో రూపాయి కుదేలైందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. చమురు దిగుమతులు మరింతగా పెరిగే సూచనలు ఉన్నందున రూపాయి విలువ మరింతగా క్షీణించి 7.80 కు కూడా చేరుకునే అవకాశం లేకపోలేదని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.