ముంబై: రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. శుక్రవారానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయి జీవన కాల గరిష్టం
రూ.71కి చేరింది. రూపాయికి ఇదే అత్యధిక పతనం కావడం గమనార్హం. గత కొద్దీ రోజులుగా పడిపోతూ వస్తున్నా రూపాయి విలువ ఈరోజుతో ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. అమెరికా డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ముడి చమురు ధరలు కూడా పెరగడంతో రూపాయి విలువ తాజాగా 26 పైసలు పడిపోయి రూ.71 వద్ద నడుస్తోంది. ఈ వారంలో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో రూపాయి విలువ కూడా క్షీణించే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.98 వద్ద ట్రేడవుతోంది.