ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌డ్ నాచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) పైన కూడా పడింది. దింతో వీటి ధరలు అక్టోబరు 1వ తేదీ నుంచి
పెరగనున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో సీఎన్‌జీ గ్యాస్ ధరలు 14 శాతం పెరిగే అవకాశాలున్నాయని దేశీయ వ్యాపారవర్గాలు పేర్కొన్నాయి. విదేశాల్లో గ్యాస్ మార్కెట్ ను బట్టి గ్యాస్ ధరను ప్రతీ ఆరు నెలలకోసారి మారుస్తుంటారు. దేశంలో రూపాయి పతనం కొనసాగుతుండడంతో గ్యాస్ ధర పెంచాలని ఇప్పటికే సీఎన్‌జీ గ్యాస్ సరఫరాదారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ సబర్బన్ ప్రాంతంలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ సరఫరా చేసే సీఎన్‌జీ గ్యాస్ ధర కిలో రూ:2.89 ఉండగా... రూపాయి పతనం నేపథ్యంలో కిలో గ్యాస్ ధరను రూ:1.43 రూపాయలు పెంచాలని చూస్తోంది.