ముంబై: దసరా... దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా రద్దీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా డబుల్ డెక్కర్ విమానాన్ని
అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉండే ముంబయి - కోల్‌కతా ప్రాంతాలకు ఈ డబుల్ డెక్కర్ విమానాన్ని నడపాలని నిర్ణయించింది. బోయింగ్ 747 డబుల్ డెక్కర్ విమానంలో 423 సీట్ల సామర్థ్యం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో 12 ఫస్ట్ క్లాస్ సీట్లు, 26 బిజినెస్ సీట్లు, 385 ఎకానమీ సీట్లు ఉన్నాయని తెలిపింది. అక్టోబర్ 16 నుంచి ఎయిర్ ఇండియా ఈ సర్వీసులను ప్రారంభించనుంది.