Print
Hits: 1805
jio happy new year offer

నూతన సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ పేరుతో కొత్త ఆఫర్‌ను ప్రవేశ పెట్టింది. రూ.399 ప్లాన్‌తో రీచార్జ్

చేసుకునే వారికి 100శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ జనవరి 31, 2019 వరకూ మాత్రమే. కాగా.. ఆ క్యాష్‌బ్యాక్‌ను మాత్రం ఏ-జియో కూపన్ల రూపంలో అందిస్తున్నట్లు జియో సంస్థ తెలిపింది. ఏ-జియో అనేది రిలయన్స్ జియో సంస్థకే చెందిన షాపింగ్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్లో ఉత్పత్తులు కొనుగోలు చేసే వారు మాత్రమే ఆ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కు అర్హులు. అయితే మరో కాండీషన్ ఏంటంటే రూ.1000 ఆ పై కొనుగోలు చేసే వినియోగదారులు మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్‌ను వాడుకోవచ్చు. అది కూడా మార్చి 15, 2019 లోపు షాపింగ్ చేసేవారికి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. రూ.399తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు మై జియో యాప్‌లో మై కూపన్స్ సెక్షన్‌లో క్యాష్‌బ్యాక్ ను చూసుకోవచ్చు.

e-max.it: your social media marketing partner