జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటు దక్కించుకుని
దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎంపీ స్థానాల్లోనూ ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండింటికి రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడు. మెగా బ్రదర్ నాగబాబుకూడా పరాజయం పాలయ్యాడు. అంతే కాకుండా ఎన్నికల అనంతరం జనసేన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఈ నెపథ్యంలో పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పలువురు దర్శకులతో చర్చిస్తున్నట్లు సమాచారం.