విశాఖపట్నం: జిల్లాలోని ధారకొండ ఏజెన్సీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. విశాఖలోని జీకే వీధి మండలం మాదిగమల్లులో మావోయిస్టులకు, పోలీసులకు
మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గత కొంత కాలంగా మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచిన సిబ్బంది ధారకొండ ఏజెన్సీ ప్రాంతం మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పక్కా వ్యూహంతో కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా... మరికొంత మంది తప్పించుకునిపోయినట్లు సమాచారం. వారి కోసం బలగాలు గాలిస్తున్నాయి. తాజా ఘటనతో విశాఖలోని ఏజెన్సీ గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.