హైదరాబాద్: ఈఎస్‌ఐ దవాఖానాలకు, డిస్పెన్సరీలకు మందుల కొనుగోలు కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్
దేవికారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మాసిస్ట్ రాధిక, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్దన్, ఓమ్నీ మెడి కంపెనీ ఎండీ శ్రీహరితో పాటు ఉద్యోగి నాగరాజు... ఈ నిందితులకు కోర్టు వచ్చే నెల 11వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం ఏసీబీ అధికారులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.