హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన 'చిన్నారులపై క్లినికల్ ట్రయల్' కేసు విచారణ ప్రారంభమైంది. ఈ రోజు నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో విచారణ
కమిటీ సమావేశం కానుంది. క్లినికల్ ట్రయల్ ఫిర్యాదుపై కమిటీ సమగ్ర విచారణ జరపనుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి హెచ్‌వోడీ రవికుమార్, ఆర్‌ఎంవో ప్రసాద్‌ను కమిటీ విచారించనుంది. విచారణ అనంతరం సోమవారం కమిటీ నివేదిక ఇవ్వనుంది.