పశ్చిమ గోదావరి: కొవ్వూరులో రూ.12కోట్ల రూపాయలతో ఉడాయించిన ఏసీఆర్ చిట్ ఫండ్ కేసులో ఆ సంస్థ యజమానులు చిన్నారావు, అతని కుమారుడు పూర్ణ సురేష్‌లను
పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థ ప్రజల నుంచి చిట్టీల రూపంలో రూ.12కోట్ల రూపాయల మేరకు మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మోసంలో 1200 మంది ఖాతాదారులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ రోజు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.