ఖమ్మం: హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తోన్న సుమారు 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు
అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానికులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు భారీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.