బెంగళూరు: కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. పరమేశ్వరకు చెందిన ట్రస్టు
కర్ణాటకలో ఓ మెడికల్ కాలేజీని నిర్వహిస్తున్నది. ఆ కాలేజీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినట్టు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు 30 ప్రదేశాల్లో ఐటీ శాఖ తనిఖీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.