గ్వాలియర్: 150 మంది విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివరాలు చుస్తే... దసరా పండుగను పురస్కరించుకుని,
అక్టోబర్ 8న ఆయుధ పూజలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వీహెచ్‌పీ కార్యకర్తలు, భజరంగ్‌దళ్ కార్యకర్తలు సంయుక్తంగా బహిరంగ స్థలంలో తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారి నినాదాలతో జనసంద్రమంతా ఉన్న ప్రాంతాన్నంతా హోరెత్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాగా... పాఠశాల పరిసర ప్రాంతాల్లో, జన సమర్ధత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ చర్యలకు పాల్పడినందుకు గానూ, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు గానూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ రోజు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్ కు తరలించారు.