మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నక్సలైట్లు కలకలం సృష్టించారు. ముగ్గురు వ్యక్తులు తుపాకులు చేత బట్టుకుని తాము
నక్సలైట్లమంటూ బెదిరింపులకు పాలపడ్డారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్, జైపూర్ పోలీసులు చెన్నూరు క్రాస్ రోడ్ వద్ద ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారు నకిలీ నక్సలైట్లుగా చెలామణి అవుతూ బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే... నిందితుల వద్ద నుండి ఒక పిస్తోల్, 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.