ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లోని నరౌరా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన నిద్రిస్తున్న యాత్రికులపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గంగానదిలో నరౌరా ఘాట్ వద్ద స్నానానికి వెళ్లిన వారే ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు.