హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సమ్మెపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు
రాకపోవడంతో రేపు బంద్ నిర్వహిస్తామని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు... ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకుని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర అశ్వత్థామను అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను ఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారన్న విషయం తెలియరాలేదు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.