అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్, టేబుల్ టాపర్ దబాంగ్ ఢిల్లీ
మధ్య ఈ రోజు తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. అనంతరం మరో సెమీ ఫైనల్ లో బెంగాల్ వారియర్స్, యూ ముంబా తలపడనున్నాయి. ఈ మ్యాచులో విస్జయం సాధించిన జట్లు ఫైనల్ లో ప్రవేశించనున్నాయి దీంతో నాలుగు జట్లు గెలుపుకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ యోధాపై 45-48 అద్భుత విజయంతో సెమీస్‌లోకి ప్రవేశించిన బెంగళూరు.. అదే జోరులో ఢిల్లీని మట్టికరిపించాలని చూస్తున్నది. మరోవైపు హర్యానా స్టీలర్స్ పై 38-46 తో విజయం సాధించి జోరు మీదున్న యూ ముంబా... పటిష్ట బెంగాల్ వారియర్స్ పై గెలవాలని ఉవ్విళూరుతోంది.