రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్సుల్లో శతకం బాదిన రోహిత్ కు ఈ సిరీస్‌లో ఇది మూడో సెంచరీ కావడం
విశేషం. ఈ సెంచరీతో రోహిత్ టెస్టుల్లో 6వ సెంచరీ సాధించగా... టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలింగులో రబడా తన పదునైన బంతులతో ఆదిలోనే మయాంక్, పుజారాను వెనక్కి పంపి షాకిచ్చినా, కెప్టెన్ కోహ్లీ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా రోహిత్ తన భాద్యతాయుత ఇన్నింగ్స్ తో చెలరేగాడు. అతడికి రహానే చక్కటి సహకారం అందించాడు. కాగా... రోహిత్ (117), రహానే(83)ల భాద్యతాయుత ఇన్నింగ్స్‌లతో పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి, 223 పరుగులు చేసింది.