అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం బాగానే ఉందని వైట్‌హౌస్‌ వైద్యులు వెల్లడించారు. కాకపోతే ఆయన కాస్త బరువు తగ్గాలట. ఇందుకోసం ట్రంప్‌ రోజూ జిమ్‌ చేస్తే బాగుంటుందని వైద్యలు సూచించారు. అధిక కేలొరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించాలని చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ట్రంప్‌కు  వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌ నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొలెస్ట్రాల్‌, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు, రక్తపోటు, గుండె పనితీరులను పరీక్షించడంతో పాటు బరువునూ వైద్యులు కొలిచారు. వీటి వివరాలను వైద్యులు రోనీ జాక్సన్‌ వెల్లడించారు. ట్రంప్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కానీ బరువు తగ్గాలని తెలిపారు. మరోవైపు ట్రంప్‌ తన ఆరోగ్యం గురించి స్పందిస్తూ.. ‘అంతా సవ్యంగానే ఉంటుందని భావిస్తున్నా. ఒకవేళ అలా జరగకపోతే స్టాక్‌ మార్కెట్లు సంతోషంగా ఉండవు’ అని  చమత్కరించారు.

నిన్నటి వరకూ అమెరికాను గడగడలాడించిన మంచు తుపాను ఇప్పుడు రష్యాను గడ్డకట్టిస్తున్నాయి. వజ్రాలు విరివిగా లభ్యమయ్యే రష్యాలోని యకూటియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కనివిని ఎరుగని స్థాయికి పడిపోయాయి. రికార్డుస్థాయిలో మైనస్‌ 67 డిగ్రీల సెంటీగ్రేడ్‌ చూపిస్తున్న ఉష్ణోగ్రతామానిని చిత్రంలో చూడవచ్చు. ఇక్కడికి సమీపంలోని యకుట్సాలో మైనస్‌ 50 డిగ్రీలు నమోదు కావడంతో కనురెప్పలు సైతం మంచుతో నిండిపోయిన అనస్తాసియా గ్రుజ్‌దెవా అనే యువతిని గమనించవచ్చు.

 

కాబుల్ లోని భారత దౌత్య కార్యాలయం ఫై ఉగ్ర దాడి జరిగింది, ఒక  రాకెట్ కార్యాలయం  ప్రాంగణం లోపల పడింది. ఈ దాడిలో ఎవరికీ ప్రాణహాని కలగలేదని, కార్యాలయం వెనుక భాగంలో  భవనానికి స్వల్ప నష్టం జరిగిందని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రాంగణం లోపల కాపలా సిబ్బంది గదులపై రాకెట్ పడిందని ఎంబసీ వర్గాలు వివరించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వివరాలు తెలుసుకొన్న విదేశాంగ శాఖా మంత్రి సుష్మ స్వరాజ్ తమ సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదని అందరు సురక్షితంగానే వున్నారని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు .కాబుల్ లో  రెండు రోజుల పర్యటన తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ప్రతినిధి బృందం దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ సంఘటన జరిగింది.

అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే భారత్ ఐటీరంగ ఉద్యోగులకు ఊరట కలగనుంది. ప్రతిభ ఆధారంగానే వలసలు అన్న విధానంతో సంవత్సరానికి 45శాతం గ్రీన్‌కార్డులను ఇచ్చేలా అమెరికా ప్రతినిధుల సభలో చట్టాన్ని ప్రవేశపెట్టింది.

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి:భూమా అఖిలప్రియ

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని పర్యాటకశాఖా మ...

కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా

నేటి నుంచి రెండ్రోజుల పాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు తొలి రోజున కలెక్టర్లతో చర్చలు జరప...

కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ

కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలోని ఆరు ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా 16,500 కోట్...

జీవో 99 ని తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలకు మంగళం: టీటీడీపీ నేత రావుల

ఉచిత విద్యను ఇస్తానని బీరాల పలికిన సీఎం ఇప్పుడు ఉన్న పాఠశాలలను మూసివేస్తున్నారని ఆరోపించారు టీటీడీపీ నేత రావుల...

మెదక్, సిద్దిపేట జిల్లాలలో సీఎం కే సీ ఆర్ పర్యటన

మెదక్, సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ , గజ్వెల్ లో సీఎం పర్యటిస్తారు, ముందుగా తూప్రాన్ లో ప్రభుత్వ దవాఖానను ప్ర...

మారిజువానా అమ్మకాలపై కాలిఫోర్నియా నిర్ణయం

వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...

న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...

అహ్మదాబాద్ లో తొగాడియా అరెస్ట్ అంటూ హైడ్రామా

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా అదృశ్యమై ఆ తర్వాత అహ్మదాబాద్‌లో ఓ ఆస్పత్రిల...

గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం, కడప జిల్లాలో విషాదం

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కడప-కర్నూలు జాతీయ రహదారి మలుపు వద్ద ప్రమాదం జ...

వనస్థలిపురంలో టిప్పర్ బీభత్సం

వనస్థలిపురంలో పీఎస్ పరిధిలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. వాహనాలపైకి టిప్పర్ దూసుకురాగా... ఇద్దరు దుర్మరణం పాల...

నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ  దాడులు

నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు

టాలీవుడ్ నిర్మాతలపై ఆదాయను పన్ను శాక దాడులు నిర్వహించారు. గత మూడేళ్ల కాలంలో పన్నులు చెల్లించకుండా ఎగ్గొట్టి తి...

ప‌ద్మావ‌త్' విడుద‌ల నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిత్ర నిర్మాత‌లు

ప‌ద్మావ‌త్' విడుద‌ల నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిత్ర నిర్మాత‌లు

ప‌ద్మావ‌త్' చిత్రం విడుద‌ల నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు చిత్ర నిర్మాత‌లు. రాష్ట్రంలో కొన్ని వ‌ర్గాల ప్...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...