ఇస్లామాబాద్: జమ్ము కాశ్మీర్ లో భారత ప్రభుత్వం చేసిన ఆర్టికల్ 370 రద్దు చట్టవ్యతిరేకమంటూ పాకిస్థాన్ విదేశాంగ శాఖ మండిపడింది. కశ్మీర్ ఒక
అంతర్జాతీయ వివాదమని, అందులో తాము భాగస్వామిగా ఉన్నామని పేర్కొంది. కశ్మీరీల ప్రయోజనాల పరిరక్షణకు పాకిస్థాన్ కట్టుబడి ఉందని, భారత్ చట్టవ్యతిరేక చర్యల నియంత్రణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ పేర్కొంది.