ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే థార్
ఎక్స్‌ప్రెస్ రాకపోకలను కూడా ఆపేస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ లోని జోథ్‌పూర్ నుంచి కరాచీ మధ్య నడిచే థార్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ఆపేస్తున్నట్టు పాక్ రైల్వే శాఖ మంత్రి రషీద్ అహ్మద్ చెప్పారు. ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన తెలిపారు. ఇప్పటికే దౌత్యపరమైన సంబంధాలు, వాణిజ్య సంబంధాలు భారత్‌తో తెగతెంపులు చేసుకున్న పాకిస్తాన్ తాజాగా రెండు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తూ మరింత అసహనాన్ని చాటుకుంది.