ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జి-7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ,
డోనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ, ట్రంప్ ఇద్దరూ పలు విషయాలపై చర్చించారు. మోడీ మాట్లాడుతూ... ట్రంప్ తనకు ఆప్త మిత్రుడని, అమెరికాతో భారత్ సంబంధాలు ఎప్పుడు కొనసాగుతాయని తెలిపారు. రెండు దేశాల మధ్య దృఢమైన వాణిజ్య బంధం ఉందని తెలిపాడు. భారత్ 2030 నాటికీ $5 ట్రిలియన్ ఎకానమీ గల ఆర్ధిక శక్తిగా ఎదగనుందని పేర్కొన్నాడు. ఇప్పటికే భారత్ లో చాల కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని తెలిపారు. అయితే... ఉగ్రవాదంపై సహించేదిలేదని, టెర్రరిజాన్ని పెంచి పోషిస్తే ఉరుకునేదిలేదని పరోక్షంగా పాక్ ను హెచ్చరించాడు. కాగా.. కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని మోడీ స్పష్టం చేశారు.