ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించని మెజార్టీతో విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టారు. పీసీసీ చీఫ్ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 22 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరచలేకపోయింది.